Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరోసారి తెరపైకి సీనియర్ నటి సరిత దంపతుల వివాదం

తన భర్త, మలయాళ నటుడు ముఖేష్ పై సీనియర్ నటి (మరోచరిత్ర ఫేం) సరిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా భర్త కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు. తమ వివాహం రద్దు కోరుతూ కేరళలోని ఎర్నాకుళం కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ వేసినా ఈ వ్యవహారంలో తనకు నోటీసులు సక్రమంగా అందటంలేదని అంటున్నారు. దీని వెనుక భర్త హస్తం ఉందేమోనన్న అనుమానం వస్తోందన్నారు. అలాగే వివాహ రద్దు విషయంలో తన వాదన చెప్పుకోవడానికి తగిన సమాయాన్ని కూడా కేటాయించడం లేదని వాపోయారు. తొలినాళ్లలో ప్రేమించి వివాహం చేసుకున్న సరిత, ముఖేష్ కు ఇద్దరు మగ పిల్లలున్నారు. అనంతరం మనస్పర్థల కారణంగా విడిపోయారు. అటు ముఖేష్ మరో వివాహం చేసుకోగా, పిల్లలతో కలసి సరిత ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్నారు.

More Telugu News